ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్..45 రోజులు గడిచినా  దొరకని ఆచూకీ

ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్..45 రోజులు గడిచినా  దొరకని ఆచూకీ

ఎల్బీనగర్, వెలుగు: ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్​ వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థి మణిదీప్ రెడ్డి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వనస్థలిపురం వైదేహి నగర్​కు చెందిన మణిదీప్, ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లాతి పట్టణంలో గల ఎల్​యూటీ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్​ చదువుతున్నాడు. గత నెల 4న తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్, మే 5 నుంచి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పందించడం లేదు.

దీంతో కుటుంబ సభ్యులు ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్నేహితులు, పరిచయస్తుల ద్వారా అతడి నివాసం, యూనివర్సిటీలో ఆరా తీశారు. అయినా ఎలాంటి సమాచారం లభించలేదు. అనంతరం ఫిన్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం తల్లిదండ్రులు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బండారు దత్తాత్రేయలను కలిసి సహాయం కోరారు. భారత్, ఫిన్లాండ్ ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమ కుమారుడిని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.